అమరేశ్వరుని సన్నిధిలో భక్తుల సందడి
అమరావతి: అమరావతి క్షేత్రం ఆదివారం భక్తులతో కళకళలాడింది. కార్తిక మాసం, ఆదివారం సెలవు కావటంతో వేకువజాము నుంచే భక్తులు రాక ఆరంభమైంది. తొలుత పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసి ఆలయంలోని ఉసిరి చెట్టు వద్ద దీపారాధన చేసి శివకేశవులకు పూజలు నిర్వహించారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచా ముండేశ్వరీదేవికి కుంకుమార్చనలు చేశారు. విద్యార్థులు వేలాదిగా స్కూలు బస్సుల్లో తరలివచ్చారు. ధ్యానబుద్ధ ప్రాజెక్టు, పాత, కొత్త మ్యూజియంలను, అమరేశ్వరాలయంలో సందడి చేశారు. ధ్యానబుద్ధ విగ్రహం వద్ద గార్డెన్‌లో వనభోజనాలు చేశారు.
సెలవు దినం కావడంతో
పెరిగిన తాకిడి
తెల్లవారుజాము నుంచే రాక
కృష్ణా నదిలో పుణ్యస్నానాలు
భక్తిశ్రద్ధలతో పూజలు
తరలివచ్చిన విద్యార్థులు


