రాష్ట్రస్థాయి పోటీలకు జెట్టిపాలెం విద్యార్థులు ఎంపిక
రెంటచింతల: ఒకేషనల్ ఎడ్యుకేషన్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ విభాగంలో నిర్వహించిన జిల్లా స్థాయి స్కిల్ డెవలప్‌మెంట్ పోటీలలో జెట్టిపాలెం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు తృతీయ బహుమతిని దక్కించుకుని రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపికై నట్లు స్కూల్ ప్రిన్సిపాల్ కె.పాపయ్య శనివారం తెలిపారు. దూళిపాళ్ల వద్ద నున్న లయోల ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 7వ తేదీన నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన 9, 10 తరగతి విద్యార్థులు తయారు చేసిన రోడ్డు ట్రాఫిక్ సిగ్నల్ ప్రాజెక్టు, ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్ ప్రాజ్టెక్‌లకు తృతీయ బహుమతి లభించిందన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రలేఖ చేతుల మీదుగా విద్యార్థులకు శిక్షణనందించిన ఉపాధ్యాయురాలు వి.స్వప్న, విద్యార్థులు బహుమతిని అందుకున్నారన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను, ఉపాధ్యాయురాలు వి.స్వప్నలను ప్రిన్సిపాల్ పాపయ్య, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు జెట్టిపాలెం విద్యార్థులు ఎంపిక


