కోలాహలంగా బాలోత్సవ్
పిల్లల అభ్యున్నతి జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, పరిసరాలపై ఆధారపడి ఉంటుందని నంబూరు వీవీఐటీయూ చాన్స్‌లర్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. నంబూరులోని విద్యా సంస్థలో ప్రపంచ తెలుగు బాలల పండుగ బాలోత్సవ్– 2025 వేడుకలు అద్భుతంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు శనివారం ఆద్యంతం ఉత్సాహభరితంగా కొనసాగాయి. చాన్స్‌లర్ విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి వారిని ఆయా రంగాల్లో ప్రోత్సహించేందుకు బాలోత్సవ్ దోహదపడుతుందని తెలిపారు. రెండవ రోజు డిజిటల్ చిత్రలేఖనం, వాద్య సంగీతం, కథా రచన, శాసీ్త్రయ నృత్యం, ప్రదర్శనశాల, వక్తృత్వం, జానపద నృత్యం, నాటికలు, జానపద గీతాలు, శాసీ్త్రయ సంగీతం, ఏకపాత్రాభినయం, స్పెల్‌బీ, తెలుగు పద్యం, తెలుగులోనే మాట్లాడుదాం, కవితా రచన, లేఖా రచన వంటి అంశాల్లో పోటీలు నిర్వహించారు. 280 పాఠశాలల నుంచి నాలుగు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. 32 వేదికలపై 350 జానపద నృత్యాలు, 54 నాటికలతో పాటు చిన్నారుల కనువిందైన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వేడుకలు ఆదివారంతో ముగుస్తాయని ప్రో చాన్స్‌లర్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు.
–పెదకాకాని
కోలాహలంగా బాలోత్సవ్
కోలాహలంగా బాలోత్సవ్
కోలాహలంగా బాలోత్సవ్
కోలాహలంగా బాలోత్సవ్


