మాచర్ల: పట్టణంలో విద్యుత్ బిల్లులు మొదటి అంతస్థుకు వెళ్లి చెల్లించే పనిలేకుండా గ్రౌండ్ ఫ్లోర్‌లోనే విద్యుత్ బిల్లుల చెల్లింపు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పల్నాడు జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ (ఎస్‌ఈ) డాక్టర్ పత్తిపాటి విజయ్ కుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని విద్యుత్ శాఖ డివిజినల్ కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన విద్యుత్ బిల్లుల చెల్లింపు సేవా కేంద్రాన్ని ఈఈ సింగయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా గ్రౌండ్ ఫ్లోర్‌లోనే విద్యుత్ బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేశామన్నారు. సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, ఏడీఏ రామయ్య, ఏఈ కోటేశ్వరరావు, పలు మండలాల ఎఈలు పాల్గొన్నారు. అనంతరం డివిజినల్ పరిధిలో 9 మండలాలకు చెందిన డీఈలు, ఏఈలు, అసిస్టెంట్ ఇంజినీర్లు, అకౌంటెంట్ ఆఫీసర్లుతో ఎస్‌ఈ పి.విజయ్‌కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు.