వైభవంగా మహాశైవక్షేత్ర పునఃప్రతిష్ట | - | Sakshi
Sakshi News home page

వైభవంగా మహాశైవక్షేత్ర పునఃప్రతిష్ట

Published Mon, Mar 17 2025 11:14 AM | Last Updated on Mon, Mar 17 2025 11:08 AM

దాచేపల్లి: దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామ సమీపంలోని శ్రీ పార్వతిదేవి సమేత చెన్నమల్లిఖార్జునస్వామి వార్ల దేవాస్థానం(మహా శైవక్షేత్రం) పునఃప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతులు శివస్వామి, టీటీడీ బోర్డు సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రామకృష్ణమచార్యుల బృందం వేదమంత్రాల సాక్షిగా పార్వతీదేవి సమేత చెన్నమల్లిఖార్జునస్వామి, గణపతి, ద్వారపాలకులు, నందీశ్వరుడు, బలిపీటం, శిఖరాన్ని ప్రతిష్టించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు చైర్మన్‌ బీఆర్‌. నాయుడు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల, మాచర్ల ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మనందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతిథులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. పల్నాటి తొలిమహిళా మంత్రి నాయకురాలు నాగమ్మ నిర్మించిన ఈ మహాశైవక్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. పిడుగురాళ్ల జెడ్పీటీసీ జంగా వెంకటకోటయ్య, సర్పంచ్‌ జంగా సురేష్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. పునఃప్రతిష్ట సందర్భంగా భారీ అన్నదానం చేపట్టారు. పల్నాడు ప్రాంతంలోని పలు గ్రామాల నుంచి అర్చకులు, భక్తులు తరలివచ్చారు. మహాశైవక్షేత్రాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరణ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement