ఒకటి నుంచి దూరవిద్య టెన్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీ | Sakshi
Sakshi News home page

ఒకటి నుంచి దూరవిద్య టెన్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీ

Published Thu, May 23 2024 5:20 AM

-

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో దూరవిద్య టెన్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ ఒకటి నుంచి 8వ తేదీ వరకు జరగనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల హాల్‌టికెట్లు జిల్లాలోని ఏఐ సమన్వయకర్తలతోపాటు ఏపీఓపెన్‌స్కూల్‌.ఏపీ.జీవోవీ.ఇన్‌ సైట్‌ నుంచి నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని తెలిపారు. పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయడంతోపాటు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ఏఐ సమన్వయకర్తలు చర్యలు చేపట్టాలని డీఈవో పి.శైలజ, ప్రభుత్వ పరీక్షల విభాగ సహాయ కమిషనర్‌ కె.వెంకటరెడ్డి ఆదేశించారు.

నర్సింగ్‌ స్కూల్‌

ప్రిన్సిపాల్‌కు చార్జిమెమో

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌ ప్రభుత్వ నర్సింగ్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ పి.లక్ష్మీరాధికకు చార్జి మెమో ఇస్తూ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ నరసింహం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నర్సింగ్‌ విద్యార్థుల నుంచి యూనిఫామ్‌, పుస్తకాల కోసం రూ.8వేలు వసూలు చేసినట్లు ఆమైపె ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్‌కు విరుద్ధంగా ఆమె పనిచేయడంతో చార్జి మెమో ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా నర్సింగ్‌ పాఠశాలలో ప్రిన్సిపాల్‌ తీరుపై గతంలో పలు మార్లు విద్యార్థులు ఫిర్యాదులు చేశారు.

నర్సింగ్‌ కాలేజీలోనూ ఇదే తీరు

గోరంట్లలోని ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్‌ కాలేజీలో కూడా విద్యార్థుల వద్ద నుంచి పుస్తకాలు, యూనిఫామ్‌ నిమిత్తం రూ. 9వేల వరకు వసూలు చేసినట్లు విద్యార్థులు చెబుతున్నారు. కళాశాలలో ఫ్రెషర్స్‌డే, ఫేర్‌వెల్‌ డే, ఇతర కార్యక్రమాల కోసం బలవంతంగా తమ వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement