వెల్దుర్తి: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు గ్రామంలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో 2024–25 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల హెచ్‌ఎం పి పద్మ కోరారు. సోమవారం ఆమె ఐటీడీఏ పాఠశాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2024–25 విద్యా సంవత్సరంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేరేందుకు 21–05–2024 నుంచి 30–05–2024 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఈ పాఠశాలలో అన్నీ తరగతులకు ఎస్టీ బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
బీసీలు 3వ తరగతికి ఆరుగురు, 4వ తరగతిలో ఆరు, ఎస్సీలు 3వ తరగతికి ఆరుగురు, 4వ తరగతిలో ఆరు, 5వ తరగతిలో ఐదు, ఓసిలు 3వ తరగతికి ఆరుగురు, 4వ తరగతిలో ఆరుగురు, 5వ తరగతిలో మూడు, 7వ తరగతిలో నాలుగు సీట్లు ఖాళీలు ఉన్నాయన్నారు. అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.