రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో భారీ దొంగతనం చోటు చేసుకుంది. ఇంటిలో ఎవరూ లేరని గుర్తించిన గుర్తుతెలియని దుండగులు ఇంటి ప్రధాన గేటుకు గల తాళాలను విరగ్గొట్టి ఇంటిలోకి చొరబడ్డారు. ఇంటిలో ఉన్న బీరువాను విరగ్గొట్టి అందులో గల 50 తులాల వెండి ఆభరణాలు, రెండు తులాల బంగారు ఆభరణాలను దొంగతం చేసినట్లు బాధితుడు గుణుపూర్ ఆదర్శ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సైంటిఫిక్ టీమ్‌తో పాటు డాగ్ స్క్యాడ్‌తో సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గుణుపూర్‌లో గల 18 వ వార్డు పరిధిలోని పార్వతీనగర్ రెండొ లైన్‌లో నివసిస్తున్న అభిమన్యు సాహు ఇంటిలో ఈ చోరీ ఘటన గురువారం చోటు చేసుకుంది. గజపతి జిల్లాలోని ఒడవా ప్రాంతంలో నివసిస్తున్న తమ బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో గత కొద్ది రొజుల క్రితం వెళ్లారు. ఇంటి బయట తాళం వేసి ఉండటం గమనించిన దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. శుక్రవారం నాడు పొరిగింటివారు ఇంటి బయట ఉన్న పూలను కోసుకునేందుకు వెళ్లి చూడగా సాహు ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించి వారి బంధువులకు సమాచారం అందించారు. సమీపంలో గల సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పొలీసులు తెలియజేశారు.


