మల్కన్‌గిరి: దుర్గాపూజను శాంతియుతంగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఆదివారం జిల్లా పోలీసులతో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. దసరాను క్రమశిక్షణతో ప్రశాంతంగా జరుపుకునేలా భరోసా కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మల్కన్‌గిరి ఆదర్శ పోలీస్ స్టేషన్ ఐఐసీ దేవేదత్త మల్లిక్ నేతృత్వంలో పోలీసు బృందం జిల్లా కేంద్రంలోని ప్రధాన మార్కెట్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది మార్కెట్ ప్రాంతాల్లో పర్యటిస్తూ దసరా సమయంలో శాంతిభధ్రతలను కాపాడేందుకు ప్రజలకు అవగాహన కల్పించారు. మల్కన్‌గిరి ఎస్పీ వినోద్ పాటిల్ ఆదేశాల మేరకు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు ఐఐసీ దేవదత్త మల్లిక్ తెలిపారు.
8 లీటర్ల విదేశీ మద్యం స్వాధీనం
● ఒకరు అరెస్టు
మల్కన్‌గిరి: దుర్గా మండపం వద్ద మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి ఎనిమిది లీటర్ల విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుర్గా మండపాలకు సమీపలో మద్యం విక్రయాలను ప్రభుత్వం నిషేధించిది. అయితే మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఉండ్రుకొండ పంచాయతీలో ఏర్పాటు చేసిన దుర్గా మండపం సమీపంలో అదే గ్రామానికి చెందిన పింటు కుమార్ యాదవ్ మద్యం విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఎనిమిది లీటర్ల విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని.. పూర్తి విచారం అనంతరం బుధవారం కోర్టుకు తరలిస్తామని పోలీసులు వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో
కెరండీ గ్రామ వాసి మృతి
పర్లాకిమిడి: పట్టణంలో 14వ వార్డు గొల్లవీధి వద్ద ఆదివారం ఉదయం 6 గంటలకు రోడ్డు దుర్ఘటనలో కెరండీ గ్రామానికి చెందిన పితాంబర్ పాండి (56) మృతిచెందారు. గుసాని సమితి కెరండీ గ్రామానికి చెందిన పితాండర్ పాండి, ఆయన భార్య ఉదయం పర్లాకిమిడి పెద్ద బజారుకు కాయగూరలు, కరివేపాకు తీసుకుని టీవీఎస్ మోపెడ్‌పై వెళ్తుండగా మెయిన్ రోడ్డు గొల్ల వీధి వద్ద మార్కెట్ నుండి వస్తున్న ఆటోను తప్పుకుని పక్కన వున్న ఒక వృద్ధ మహిళను తప్పించబోయి ఆటో కింద పడ్డారు. పితాంబర్ భార్య స్వల్ప గాయాలతో బయటపడింది. పితాంబర్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ప్రభుత్వ మెడికల్ తరలించగా పితాంబర్ మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆయన భార్య కుటుంబీకుల రోదనలతో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆటో డ్రైవర్‌ను ఆదర్శ పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసును స్థానిక ఆదర్శ పోలీసు అధికారులు విచారిస్తున్నట్టు ఐఐసీ ప్రశాంత భూపతి తెలియజేశారు.


