రాయగడ: దసరా నవరాత్రుల్లో భాగంగా ఆదివారం అమ్మవార్లకు అష్టమి పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్ధానిక బాలాజీనగర్లోని కల్యాణ వేంకటేశ్వర ఆలయంలొ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు అష్టమి విశిష్టతను భక్తులకు వివరించారు. అలాగే స్థానిక కొరాపుట్ కూడలి వద్ద గల కన్యకాపరమేశ్వరి ఆలయంలో కన్యకాపరమేశ్వరి అమ్మవారిని లక్ష్మీ అవతారంగా రూపొందించారు. సాయంత్రం దుర్గమ్మ అవతారంగా భక్తులకు దర్శన భాగ్యం కలిగేలా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మందిరంలొ కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలతో అలంకరించారు. కన్యకాపరమేశ్వరి ఆలయ కమిటీ అధ్యక్షులు కింతలి అమర్నాఽథ్, పూజా కమిటీ సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిత్యం అమ్మవారి సన్నిధిలో లలితా సహస్త్రనామ పారాయణాన్ని మహిళలు పటిస్తున్నారు.


