ఇద్దరు నేరస్తులు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు నేరస్తులు అరెస్టు

Oct 19 2026 1:19 AM | Updated on Oct 19 2026 1:19 AM

జయపురం: జయపురం పట్టణ పోలీసులు ఇద్దరు కరుడుగట్టిన నేరస్తులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో స్థానిక బాపూజీనగర వాసి హీరెన్‌ నాహెక్‌, కొత్తవీధి రెండవ లైన్‌కు చెందిన శిశవ జాని ఉన్నట్టు పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్‌ చంధ్రరౌత్‌ ఆదివారం వెల్లడించారు. వారి నుంచి రెండు కత్తులు, వెయ్యి రూపాయిలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. శనివారం సాయంత్రం జయపురం గాంధీ చౌక్‌ వద్ద పోలీసులు ట్రాఫిక్‌ నియంత్రించేందుకు చర్యలు చేపడుతుండగా అదే సమయంలో హిరన్‌, శివలు దొంగతనాలు చేసేందుకు ఆ ప్రాంతంలో తిరుగుతున్నారు. వారిని అనుమానించిన పోలీసులు అదుపులోకి తీసుకోబోతున్న సమయంలో వారు కత్తులతో పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకొని స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారించగా దొంగతనాలు చేసేందుకు తాము వచ్చినట్లు వెల్లడించినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్టు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ దీపక్‌ పండ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement