కొలువు దీరిన దుర్గమ్మలు | - | Sakshi
Sakshi News home page

కొలువు దీరిన దుర్గమ్మలు

Oct 18 2026 1:12 AM | Updated on Oct 18 2026 1:12 AM

రాయగడ: దసరా నవరాత్రుల్లో భాగంగా దుర్గమ్మలు మందిరాల్లో కొలువుదీరారు. స్థానిక పాత పోలీస్‌ స్టేషన్‌ కల్యాణమండపంలో పొలీస్‌ యంత్రాంగం నిర్వహిస్తున్న దసర ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కొలువుదీరి పూజలను అందుకుంటున్నారు. అదేవిధంగా ఎస్‌బీఐ కాలనీ, బ్రహ్మణవీధుల్లో అమ్మవార్లు భక్తులకు దర్శనభాగ్యం కలిగిస్తున్నారు. నవరాత్రుల్లో ఏడో రోజున అమ్మవారు సరస్వతి, లక్ష్మీ అమ్మవార్లుగా దర్శనం ఇచ్చారు. ప్రత్యేకంగా అమ్మవార్లను అలంకరించారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం మజ్జిగౌరి అమ్మవారు దసర నవరాత్రుల్లొ సునాభెషొలో దర్శనం ఇస్తుండగా పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్థానిక కరణం వీధి కూడలి వద్ద లక్ష్మీ గణపతి మందిరంలో ప్రముఖ వేద పండితులు రేజేటి శ్రీరామ శర్మ ఆధ్వర్యంలో శనివారం నాడు బాలల పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తొమ్మిది మంది బాలలను విశేషంగా అలంకరించి నవ దుర్గల ప్రతిరూపాలుగా వారిని పూజించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement