పర్లాకిమిడి: స్థానిక రాజవీధి కల్యాణ మండపంలో యునైటెడ్ మానవ హక్కులు, అవినీతి వ్యతిరేక కౌన్సిల్ (యు.హెచ్.ఆర్.సీ.) గజపతి జిల్లా బోర్డు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షులు రాహుల్ హార్, మహిళా అధ్యక్షురాలు తనుజూ శతపతి, మహిళా ఉపాధ్యక్షురాలు జాస్మిన్ షేక్, రాయఘడ సమితి అధ్యక్షులు హాజరయ్యారు. సమావేశంలో సాధరణ ప్రజలకు సురక్షా, సమాంతర అధికారాలు, చట్టాలపై అవగాహన కల్పించారు. భవిష్యత్లో మానవ హక్కులు ఉల్లంఘనపై పోరాడతామని యు.హెచ్.ఆర్.సి సభ్యులు ప్రమాణం చేశారు.


