జయపురం: జయపురం సబ్డివిజన్ బోయిపరిగుడ సమితి చంద్రపడలో గల ఒడిశా ఆదర్శ పాఠశాలలో ఒడిశా సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ చాలెంజ్ అభిజాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాలలో 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పరిశ్రమల విభాగ అదనపు అధికారి ఉమాచరణ్ మహంతి ముఖ్యఅతిథిగా హాజరై ఒడిశా సేవ్ ఫస్ట్ ఇన్నోవేషన్ చాలెంజ్ కార్యక్రమం లక్ష్యాలను వివరించారు. ప్రతి విద్యార్థి స్మృజనాత్మకత, ఆవిష్కరణ, క్రిటికల్ తింకింగ్, వ్యవస్థాపక మనస్తత్వాన్ని ఏర్పరచుకోవాలన్నారు. నేటి యువత, విద్యార్థులు ప్రపంచంలో వాస్తవ పరిస్థితులు గుర్తించి, సమాజ ప్రగతి కోసం, ప్రాక్టికల్ టెక్నాలజీ ఆధారిత స్కేలబుల్ సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించాలన్నారు. విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలను భవిష్యత్ కోసం అర్థవంతంగా మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఒడిశా సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ చాలెంజ్ అభిజాన్ కార్యక్రమంపై లిటరేచర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల మధ్య నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.


