హెల్మెట్ల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

హెల్మెట్ల పంపిణీ

Oct 18 2026 1:12 AM | Updated on Oct 18 2026 1:12 AM

శ్రీకూర్మంలో కార్డన్‌ సెర్చ్‌

జయపురం: జయపురం సబ్‌డివిజన్‌ కొట్‌పాడ్‌ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రూపు భొత్ర ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సప్తాహ సందర్భంగా సంకల్స్‌ అభిజాన్‌ కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా షడకు సురక్షా సచేతన ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ నియమాలు ప్రతీవారు పాటించాలన్మానరు. ప్రతి మోటారు బైక్‌ చోదకులు హెల్మెట్‌లో వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. హెల్మెట్‌లు లేకుండా బైక్‌లు నడిపితే ప్రమాదాలు జరిగి మరణాలు సంభవిస్తాయని హెచ్చరించారు. ఈ సేవా సంకల్ప్‌ అభిజాన్‌ కార్యక్రమంలో ఆయన హెల్మెట్‌లు లేకుండా బైక్‌లలో వస్తున్న వారికి ఉచితంగా హెల్మెట్‌లు పంచారు. ఈ సంకల్ప్‌ అభిజాన్‌లో ఎమ్మెల్యేతోపాటు కొట్‌పాడ్‌ పోలీసు అధికారి రుణు మఝి, కొరాపుట్‌ ప్రాంతీయ ట్రాన్స్‌ఫోర్టు విభాగ అసిస్టెంట్‌ అధికారి చంద్ర కళా నాయక్‌, జూనియర్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాసుదేవ్‌ బెహరా తదితరులు పాల్గొన్నారు.

సత్యనారాయణ సేవలు చిరస్మరణీయం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: న్యాయవాదిగా పైడి సత్యనారాయణ అందించిన సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. సత్యనారాయణ చిత్రపటాన్ని కుమార్తె, విశాఖపట్నం అదనపు జిల్లా న్యాయమూర్తి పైడి మంగకుమారి శనివారం జిల్లా బార్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో అధ్యక్షుడు కూన రాజారావు, కార్యదర్శి చిట్టి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బార్‌ కార్యాలయాని రెండు ఏసీ మిషన్లు వితరణ చేశారు. కార్యక్రమంలో బార్‌ ప్రతినిధులు, సీనియర్‌ న్యాయవాదులు డాక్టర్‌ ఎన్ని సూర్యనారాయణ, బీసీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఆగూరి ఉమామహేశ్వరరావు, పొన్నాడ వెంకటరమణ, కె.నాగభూషణరావు, వాన కృష్ణచంద్‌, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

గార: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని శ్రీకాకుళం వన్‌టౌన్‌ సీఐ వై.రామకృష్ణ అన్నారు. శనివారం ఉదయం శ్రీకూర్మంలో కార్డన్‌సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి మద్యం వంటివి తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఆపరేషన్‌ నిర్వహించామన్నారు. గ్రామస్తులు ఎన్నికల నిబంధనలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సీహెచ్‌.గంగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement