స్వచ్ఛంద నేత్ర దానానికి 22 మంది పేర్లు నమోదు | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛంద నేత్ర దానానికి 22 మంది పేర్లు నమోదు

Oct 18 2026 1:12 AM | Updated on Oct 18 2026 1:12 AM

రాయగడ: మరణాంతరం నేత్రదానం చేయడం ద్వారా చూపులేని వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపవచ్చని, నేత్రదానంపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించి ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక మహిళా కళాశాల ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వెలుగుల కానుక నేత్రదాన అవగాహన కార్యక్రమంలో స్వచ్ఛందంగా నేత్రదానం చేసేందుకు 22 మంది ముందుకు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వికల్ప్‌ సంస్థ, రాయగడ మహిళా కళాశాల, దృష్టి దాన్‌ ఐ బ్యాంక్‌ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అర్చనా పట్నాయక్‌ అతిథులను పరిచయం చేశారు. ముఖ్యఅతిథిగా డాక్టర్‌ మమత సాహు, ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి టెక్నిషియన్‌ విజయ్‌ నేత్రదానం ప్రాముఖ్యతను వివరించారు. నేత్రదానం ద్వారా చూపు సమస్యలతో బాధపడుతున్న వారికి కొత్త ఆశను అందించవచ్చన్నారు. వికల్ప్‌ సంస్థ అధ్యక్షుడు, విద్యావేత్త డాక్టర్‌ దష్మంత్‌ మహంతి మాట్లాడుతూ నేత్రదానం కేవలం పుణ్యకార్యం మాత్రమే కాదని, చూపులేని వారి జీవితాల్లో వెలుగులు నింపే అమూల్యమైన కానుకగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో వికల్ప్‌ సంస్థ సభ్యులు త్రివేణి మిశ్రా, సంధ్యారాణి పాత్రో, రాజేంద్ర సాహు, రవినారాయణ శతపతి, మన్మథ తులొ, అధ్యాపకులు సౌమ్యరంజన్‌ సాహు, రఘునాథ్‌ భుయే తదితరులు పాల్గొన్నారు. సంస్థ కార్యదర్శి జగదీష్‌ చంద్ర దొర పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement