40 కిలోమీటర్లు వెంబడించి.. | - | Sakshi
Sakshi News home page

40 కిలోమీటర్లు వెంబడించి..

Oct 18 2026 1:12 AM | Updated on Oct 18 2026 1:12 AM

పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న ఒడిశా వాసులు

వ్యాన్‌లో 14 గోవులు, రెండు మృతి

పరారైన డ్రైవర్‌, క్లీనర్‌

ఇచ్ఛాపురం రూరల్‌ : ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌ మీదుగా గోవులను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్‌ను ఒడిశాకు చెందిన సామాజిక కార్యకర్తలు అడ్డుకున్నారు. స్థానిక పోలీసులు సహకారంతో సుమారు 40 కిలోమీటర్ల మేర వెంబడించి ఇచ్ఛాపురం మండలం కేదారిపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో వ్యాన్‌ను పట్టుకునే ప్రయత్నం చేయగా.. వాహనాన్ని అక్కడే వదిలేసి డ్రైవర్‌, క్లీనర్‌ పరారయ్యారు. వివరాలలోకి వెళితే...

ఒడిశా రాష్ట్రంలోని సరగడ గ్రామం నుంచి ఆవులను వ్యాపారులు కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఒడిశా పితాతొళీ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్తలు కాతిల వాసంతి, కాతిల హేమసుందర్‌లు ఒడిశా పోలీస్‌లకు తెలియజేశారు. దీంతో వ్యాన్‌ను పోలీసులు వెంబడించగా, ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామం పితాతొళి యువకులు ఇదే రహదారిపై గోవులను తరలిస్తున్న వాహనాన్ని వెంబడించి కేదారిపురం వద్ద అడ్డుకున్నారు. అప్పటికే డ్రైవర్‌, క్లీనర్‌లు పరారయ్యారు. పట్టుబడిన వ్యాన్‌లో మొత్తం 14 గోవులు ఉండగా, వాటిలో రెండు మృతి చెందినట్లు గుర్తించారు. మృతి చెందిన గోవులను స్థానిక తోటలో ఖననం చేశారు. సమాచారం అందుకున్న రూరల్‌ ఎస్‌ఐ జనార్దనరావు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. 12 గోవులను గోశాలకు తరలిస్తున్నట్లు సామాజిక కార్యకర్తలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement