నెలల తరబడి అందని దివ్యాంగుల పింఛన్లు | - | Sakshi
Sakshi News home page

నెలల తరబడి అందని దివ్యాంగుల పింఛన్లు

Oct 17 2026 12:40 AM | Updated on Oct 17 2026 12:40 AM

రాయగడ: ప్రభుత్వ పథకాలు ఉన్నా.. అర్హత కలిగిన దివ్యాంగులకు సకాలంలో పింఛన్లు అందడం లేదని ఆవేదన జిల్లాలో వ్యక్తమైంది. నెలల తరబడి పింఛన్లు అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న దివ్యాంగులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం లభించడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఒడిశా దివ్యాంగుల మంచ్‌ జిల్లా అధ్యక్షుడు రాకేష్‌ హిమిరిక స్థానిక కలెక్టర్‌ కార్యాలయం ప్రాంగణంలో భిక్షాటన చేస్తూ వినూత్న నిరసనకు దిగారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పఽథకాలు, సామాజిక భద్రతా కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ, వాటి ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందడం లేదని సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ల కోసం సమితి కార్యాలయాలు, సంబఽంధిత శాఖ కార్యాలయాలు, కలక్టరేట్‌లో ఫిర్యాదుల విభాగం చుట్టూ తిరిగినా హామీలు తప్ప సమస్యల పరిష్కారం కావడం లేదని వాపోయారు. రాకేష్‌హ మిరిక తెలిపిన వివారాల ప్రకారం జిల్లాలో పలువురు దివ్యాంగులకు మూడు నెలల నుంచి పింఛన్లు అందలేదని తెలిపారు. తనకు కూడా ఐదు నెలలకు పైగా పింఛను రాకపొవడంతో జీవనం భారంగా మారిందని ఆయన పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యలపై అధికారులు తగిన శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. బకాయి పింఛన్లు వెంటనే విడుదల చేయాలని, ప్రతి నెల క్రమం తప్పకుండా పింఛన్లు అందించాలని, దివ్యాంగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేస్తూ రాకేష్‌ కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టారు. ఈ విషయం పై జిల్లా సామాజిక భద్రత అధికారి ఎలిజబెత్‌ గరడాను సంప్రదించగా , దివ్యాంగుల సమస్యలపై చర్చించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement