సోలార్‌ ప్యానల్స్‌ కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

సోలార్‌ ప్యానల్స్‌ కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు

Oct 17 2026 12:40 AM | Updated on Oct 17 2026 12:40 AM

పర్లాకిమిడి: ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందజేస్తున్న సోలార్‌ ప్యానెల్స్‌ను ఇంటికి ఇన్‌స్టాల్‌ చేస్తానని నమ్మించి రూ 38 వేలను కాజేసిన సందీప్‌ పట్నాయిక్‌ (41)కు గురువారం ఆర్‌.ఉదయగిరి జె.యం.ఎఫ్‌.సీ. న్యాయమూర్తి సువాంకర్‌ మహాంతి నిందితుడికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.40వేల జరిమానాను విధిస్తూ తీర్పును వెల్లడించారు. ఈ సంఘటన రామగిరిలో ఈ ఏడాది మే 8న రామగిరి పీఎస్‌ పరిధిలోని సర్గిసాయి గ్రామానికి చెందిన శంకర్‌ రయితోకు జరిగింది. ఎస్‌ఓఏ సీఎస్‌ఆర్‌ కంపెనీకి చెందిన ఉద్యోగి సందీప్‌ పట్నాయిక్‌ సోలార్‌ ప్యానెల్స్‌ శంకర్‌ ఇంటికి అమర్చుతానని అడ్వాన్సుగా దఫ దఫాలుగా ఫోన్‌పే ద్వారా రూ.38 వేలు సందీప్‌ భార్య అకౌంట్‌కు తరలించాడు. అయితే నాలుగు నెలలు కావస్తున్నా ఇంటికి సోలార్‌ ప్యానెల్స్‌ను బిగించకపోవడంతో మోసపోయిన శంకర్‌ రామగిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసును ఏఎస్‌ఐ సంతోష్‌ కుమార్‌ బెహరా రిజిస్టర్‌ చేసి దర్యాప్తు చేశాడు. నాలుగు నెలల కాలపరిమితిలో నిందితుడు సందీప్‌ పట్నాయిక్‌ను పట్టుకుని కేసుపెట్టాడు. దీంతో గురువారం ఆర్‌.ఉదయగిరి కోర్టులో ఈ కేసు తీర్పు వెలువడింది. ఆర్‌.ఉదయగిరి పోలీసు ష్టేషన్‌ ఐఐసీ కల్పలతా ప్రధాన్‌ కేసును కోర్టుకు తరలించగా, ఏపీపీ దుర్యోధన కోరాడ కేసును శంకర్‌ తరఫున వాదించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement