కొరాపుట్: డాబుగాం జగన్నాథ మందిరంలో దొంగతనం జరిగింది. శుక్రవారం ఉదయం నబరంగ్పూర్ జిల్లా డాబుగాం సమితి కేంద్రంలో ఉన్న జగన్నాథ మందిరం తలుపులు తెరవడానికి అర్చకుడు కలియా పాఢీ వెళ్లడంతో దొంగతనం విషయం వెలుగు లోనికి వచ్చింది. దొంగలు దేవాలయం తాళాలు విరగ్గొట్టి మందిరంలో విగ్రహాలపై ఉన్న ఆభరణాలు, హుండిలో డబ్బులు పట్టుకుపోయారు. అర్చకుని సమాచారంతో కమిటీ కార్యదర్శి గెంబలి సాయిరాజు దేవాలయానికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు, క్లూస్ టీం, తహసీల్దార్, దేవదాయ సిబ్బంది వచ్చి చోరీ వివరాలు సేకరిస్తున్నారు.


