రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

Oct 17 2026 12:40 AM | Updated on Oct 17 2026 12:40 AM

టెక్కలి రూరల్‌: సంతబొమ్మాళి మండలం హనుమంతునాయుడుపేట వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. హనుమంతునాయుడుపేటకు చెందిన గిన్ని లక్ష్మణరావు తన గ్రామం వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా అటుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లక్ష్మణరావుకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు.

ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ

కంచిలి: పెద్దకొజ్జిరియా గ్రామంలో పంట పొలాలకు విద్యుత్‌ సరఫరా కోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీకి గురైంది. అందులో ఉన్న ముఖ్యమైన పరికరాలు, రాగి వైర్లు చోరీ చేశారని బాధిత రైతులు లోళ్ల శాంతమూర్తి, కర్రి చంద్రయ్య, గున్న వసమ్మ శుక్రవా రం విలేకరులకు తెలిపారు. విద్యుత్‌ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.

సైకిల్‌పై దుర్గమ్మ చెంతకు..

నరసన్నపేట: స్థానిక హనుమాన్‌నగర్‌ చెందిన వెలమల గణేష్‌ భవానీమాల ధరించి విజయవాడ దుర్గమ్మ దర్శనానికి శుక్రవారం సైకిల్‌పై పయనమయ్యారు. స్థానిక దుర్గాభవానీ కార్‌ స్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన శరన్నవరాత్రి మంటపం నుంచి బయలు దేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది కాలినడకన దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నానని, ఈసారి సైకిల్‌ యాత్ర చేస్తున్నానని చెప్పారు.

పారా మెడికల్‌ కోర్సులతో ఉపాధి అవకాశాలు

శ్రీకాకుళం రూరల్‌ : పారామెడికల్‌ కోర్సులకు మంచి డిమాండ్‌ ఉందని, దేశ విదేశాల్లో అపార ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని పద్మశ్రీ అవార్డు గ్రహీత కూటికుప్పల సూర్యారావు అన్నారు. రాగోలు జెమ్స్‌ ఆస్పత్రి ఆడిటోరియంలో శుక్రవారం బొల్లినేని మెడిస్కిల్స్‌ బీఎస్సీ పారా మెడికల్‌ కాలేజ్‌ 2021–22 బ్యాచ్‌ విద్యార్థుల కాన్వొకేషన్‌ సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య చికిత్సలో పారామెడికల్‌ పాత్ర ఎంతో కీలకమన్నారు. రిమ్స్‌ ప్రిన్సిపాల్‌ ఎస్‌.అప్పలనాయుడు మాట్లాడుతూ పారా మెడికల్‌ కోర్సులు పూర్తిచేస్తే ప్రభుత్వ, ప్రైవేట్‌ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కళాశాల డీన్‌ డాక్టర్‌ లక్ష్మీలలిత, బొల్లినేని, పారామెడికల్‌ ప్రిన్సిపాల్‌ సుగునేశ్వరి, జెమ్స్‌ అకడమిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధీర్‌, బొల్లినేని మెడిస్కిల్స్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జ్యోత్స్న, బొల్లినేని అకడమిక్‌ డైరెక్టర్‌ లక్ష్మీ పద్మజ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

రేకిల్లు దగ్ధం

ఇచ్ఛాపురం రూరల్‌ : డొంకూరు గ్రామంలో షార్ట్‌సర్కూట్‌తో రేకిల్లు దగ్ధమయ్యింది. గ్రామానికి చెందిన సురాడ త్రినాద్‌ అతని భార్య శ్రీవాణి శుక్రవారం పొలానికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగివచ్చేసరికి ఇంట్లో మంటలు చెలరేగాయి. అప్పటికే కొంతమేరకు సామగ్రి దగ్ధమైంది. గ్రామస్తులంతా కలసి మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. బంగారు ఆభరణాలతో పాటు రూ.25వేల నగదు, విలువైన పత్రాలు కాలిబూడిదయ్యాయి. రూ.రెండు లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని బాధితులు విలపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement