పర్లాకిమిడి: ఒడిశాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్టలు తీసుకువచ్చిన అసాధారణ ప్రతిభావంతులను గుర్తిస్తూ, బ్రహ్మాపురానికి చెందిన సామాజిక, సాంస్కృతిక సంస్థ మధుమయ పాణిగ్రాహి ఫౌండేషన్ (ఎం.పి.ఎఫ్.) ప్రతిష్టాత్మకమైన కుమార పౌర్ణమి జాహ్నాలో యూత్ అచీవర్స్ అవార్డులు 2026 కు ఎంపికై న ముగ్గురు పేర్లను శుక్రవారం బరంపురంలో ప్రకటించారు. జపాన్ దేశం, టోక్యోలో జరిగిన వేసవి డెఫ్ ఒలింపిక్స్లో కరాటేలో భారత దేశానికి తొలి పతకాన్ని సాధించిన లోమా స్వైన్, కలాహాండి జిల్లాకు చెందిన ప్రముఖ జానపద గాయకుడు, గేయ రచయిత, సంగీత దర్శకుడు సర్వేశ్వర్ భోయ్,మిస్టీన్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని గెలుచుకున్న అందాలభామ ప్రసూచి పండా ఈ అవార్డుకు ఎంపికై నట్టు హృషికేష్ పాణిగ్రాహి తెలియజేశారు. అందాల భామ ప్రసూచి పండా, జైపూర్లో జరిగిన మిస్ టీన్ దివాగ్రాండ్ ఫినాలేలో 37 మంది ఫైనలిస్టులతో పోటిపడి జాతీయ స్థాయి టైటిల్ను గెలుచుకుంది. తద్వారా ఆమె అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిఽథ్యం వహించే ఆవకాశాన్ని దక్కించుకుంది. ఎంపికై న ప్రతి ఆవార్డు గ్రహీతకు సంప్రదాయ బ్రహ్మాపుర పట్టుశాలువా, జ్ఞాపికతో కూడిన ప్రశంసా ఫలకం, రూ. 10వేలు నగదు బహుమతి అందజేస్తామని ఎంపీఎఫ్ ఫౌండర్ హృషికేష్ పాణిగ్రాహి తెలియజేశారు. గత 16 ఏళ్లుగా మధుమయ పాణిగ్రాహి ఫౌండేషన్ గ్రామీణ క్రీడల్లో పాల్గొనేలా 3వేల మంది పాఠశాల, కళాశాలలకు చెందిన బాలికలను ప్రోత్సహించింది. అంతేకాక ఎంపీఎఫ్ ఫౌండేషన్ ద్వారా వివిధ రంగాల్లో రాణిస్తున్న యువ ప్రతిభావంతులను గుర్తించి సత్కరించే విశిష్ట పురస్కారంగా గుర్తింపు పొందింది. ఇప్పటి వరకూ ఈ సంస్థ 45 మంది ప్రముఖుల జాబితాలో కామన్వెల్త్ క్రీడల స్వర్ణపతాక విజేతలు, వెయిట్లిఫ్టర్ కె.రవికుమార్, ప్రముఖ నృత్యకళాకారులు హారిహార దాస్, భారత మహిళల ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ శశ్మితా మల్లిక్, అంతర్జాతీయ మహిళా క్రికెటర్ రోసన్నారా కెఫటిలా పర్విన్ తదితరులను ప్రోత్సాహించి అవార్డులను అందజేసింది. వచ్చే కుమార పౌర్ణమి పండుగ నాడు లోమా, సర్వేశ్ర్, ప్రసూచి పండాలకు బరంపురంలో ఆవార్డు ప్రదాన ఉత్సవం జరగుతుందని హృషికేష్ పాణిగ్రాహి తెలియజేశారు.


