పర్లాకిమిడి: స్థానిక శ్రీక్రిష్ణచంద్ర గజపతి (స్వయం ప్రతిపత్తి) కళాశాల విద్యార్థి సంఘం ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా జరిగాయి. ప్రిన్సిపల్ రాధాకాంత భుయ్యాన్ ఎన్నికల ఫలితాలను సాయంత్రం ప్రకటించారు. కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా కృష్ణచంద్ర కార్జి (పి.జి.ఎం.ఎ.), ఉపాధ్యక్షురాలిగా అమితారాణీ సింగ్ (యు.జి.సెకండ్ ఇయర్), జనరల్ సెక్రటరీగా నవీన్ బెహరా, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా టునా బిడికా, డ్రామాటిక్ సెక్రటరీగా దీపక్ రంజన్ మహాపాత్రో తదితరులు ఎన్నికయ్యారు. వీరిని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అభినందించారు.అదే విధంగా, పట్టణంలో ఉన్న మహిళా స్నాతక కళాశాల విద్యార్థిని సంఘం ఎన్నికల ఫలితాలను ప్రిన్సిపల్ రీనా సాహు సాయంత్రం విడుదల చేశారు.
సంఘం అధ్యక్షురాలిగా కార్తికేశ్వరీ దేవి, ఉపాధ్యక్షురాలిగా మధుస్మితా భుయ్యాన్, యూనియన్ సెక్రటరీగా రీనా భోంజో, డ్రామాటిక్ సొసైటీ సెక్రటరీగా ఇస్పితా పాఢి, అథ్లెటిక్ కార్యదర్శిగా భానుప్రసాదినీ రవుత్, కామన్రూం సెక్రటరీగా సౌమ్యరాణి లిమ్మా తదితరులు ఎన్నికయ్యారు.


