ఇద్దరు వలస కార్మికులు మృతి | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు వలస కార్మికులు మృతి

Oct 16 2026 10:28 AM | Updated on Oct 16 2026 10:28 AM

● స్వగ్రామాల్లో విషాదం

రాయగడ: కుటుంబ పోషణ కోసం ఇతర రాష్ట్రాలకు వలస కూలీలుగా వెళ్లి అక్కడ నుంచి విగతజీవులుగా స్వగ్రామాలకు తిరిగి వస్తున్న ఘటనలు జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కాసీపూర్‌ సమతికి చెందిన ఇద్దరు యువకులు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో వలస కూలీలుగా పనిచేస్తూ బుధవారం ఇద్దరు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సమితిలోని కొడిపారి పంచాయతీలోని ఒడాకల్‌ గ్రామానికి చెందిన టిమా మాఝి కొడుకు జయరాం మాఝి (21) తెలంగాణ రాష్ట్రంలో మృతి చెందగా.. అదే సమితి పరిధిలోని మైకంచ్‌ పంచాయతీలోని నువాగా గ్రామానికి చెందిన చింతామని నాయక్‌ కొడుకు రంజిత్‌ నాయక్‌ (20) తమిళనాడులో మృతి చెందాడు. వివరాల ప్రకారం.. జయరాం మాఝి గత నెల క్రితం ఉపాధి కోసం తమిళనాడు రాష్ట్రంలోని చైన్నె వెళ్లి అక్కడ ఓ కంపెనీలో కూలి పనివాడిగా పనిచేస్తుండేవాడు. విధులు నిర్వహణలో భాగంగా పనులు పూర్తి చేసి తను ఉంటున్న వసతి గృహానికి వెళ్తుతుండగా గుర్తు తెలియని ఒక వాహనం ఢీకొని మృతి చెందాడు. మరో రొడ్డు ప్రమాదంలో రంజిత్‌ కూడా మృతి చెందినట్లు కుటుంబీకులకు సమాచారం అందింది. మృతదేహాలను ఆయా ప్రాంతాల నుంచి స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు జిల్లా కార్మిక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

రంజిత్‌ నాయక్‌ (ఫైల్‌)

జయరాం మాఝి (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement