క్యాన్సర్‌ వైద్య సేవలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ వైద్య సేవలు ప్రారంభం

Oct 16 2026 1:12 AM | Updated on Oct 16 2026 1:12 AM

కొరాపుట్‌: కొరాపుట్‌ జిల్లా కేంద్రంలోని సాహిద్‌ లక్ష్మణ్‌ నాయక్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో క్యాన్సర్‌ వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. క్యాన్సర్‌ డాయాగ్నసిస్‌, చికిత్స యంత్రాలను జిల్లా కలెక్టర్‌ సత్యవాన్‌ మహాజన్‌ గురువారం ప్రారంభించారు. అత్యన్నత ప్రమాణాలతో విలువైన యంత్రాలను రోగుల చికిత్స కోసం అందుబాటులోకి తెచ్చారు. అంతకు ముందు రిబ్బన్‌ కత్తిరించి ప్రత్యేక బ్లాక్‌ని ప్రారంభించారు. కార్యక్రమంలో కొరాపుట్‌ ఎమ్మెల్యే రఘురాం మచ్చో పాల్గొ ్చన ఛీానరు.

కొత్త కలెక్టర్‌తో రెవెన్యూ ఉద్యోగుల భేటీ

కొరాపుట్‌ : నబరంగ్‌పూర్‌ జిల్లా కొత్త కలెక్టర్‌ మధు స్మితతో రెవెన్యూ ఉద్యోగుల సంఘాల నాయకులు భేటీ అయ్యారు. గురువారం మర్యాదపూర్వకంగా కలిసి జిల్లా పురోగతికి కలసికట్టుగా పని చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు ప్రభుత్వ న్యాయవాదులు కలెక్టర్‌ను కలిసి జిల్లా పరిస్థితులను వివరించారు.

పాఠ్య పుస్తకాలు పంపిణీ ప్రారంభం

మల్కన్‌గిరి: ఒడిశా ప్రభుత్వం పాఠశాలలు, సాముహిక విద్యాశాఖ అదేశాల మేరకు మల్కన్‌గిరి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సవరించిన, తప్పులు లేని కొత్త పాఠ్య పుస్తకాలను గురువారం పంపిణీ చేశారు. రాష్ట్ర పాఠ్య పుస్తకాల ముద్రణ, పంపిణీ డైరెక్టరేట్‌ నుంచి జిల్లాస్థాయి డిపోకు అవసరమైన పుస్తకాలు చేరుకున్న అనంతరం జిల్లా ప్రాజెక్టు సమన్వయకర్త జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో మొత్తం ఏడు సమితులకు పుస్తకాలను సరఫరా చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజాన్‌ పాణిగ్రాహి స్వయంగా మల్కన్‌గిరి మున్సిపాలిటీ పరిధిలోని ఆశీర్వాద్‌ కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చేరుకుని పుస్తకాలను పంపిణీ చేశారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు

జయపురం: జయపురం సబ్‌ డివిజన్‌ బొయిపరిగుడ సమితి చిపాకూర్‌ గ్రామ పంచాయతీ గదియజొడి గ్రామ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు బొయిపరిగుడ పోలీసు అధికారి వెల్లడించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారు భాలూపొర గ్రామానికి చెందిన కృష్ణ ఖొర, కెందుకుండ గ్రామానికి సురేంద్ర ఖొరగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణ ఖొర తన భార్య, బిడ్డతో బైక్‌పై రామగిరి ప్రాథమిక హాస్పిటల్‌కు వెళ్లాడు. హాస్పిటల్‌లో భార్యాబిడ్డలను పెట్టి తిరిగి వస్తున్న సమయంలో గొదియజొడి గ్రామ సమీపంలో రామగిరి వైపు వెళ్తున్న సురేంద్ర ఖొర ఎదురుగా వచ్చి ఢీకొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అంబులెన్స్‌ రప్పించి క్షతగాత్రులను బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement