కొనసాగుతున్న శరన్నవరాత్రులు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న శరన్నవరాత్రులు

Oct 16 2026 1:12 AM | Updated on Oct 16 2026 1:12 AM

రాయగడ : దసరా ఉత్సవాల్లో భాగంగా శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. కొరాపుట్‌ కూడలి సమీపంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందిరం ప్రాంగణంలో మహిళలు సహస్ర పసుపు గౌరమ్మ పూజలు చేశారు. అనంతరం బాలాత్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కన్యకాపరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు, రాయగడ మజ్జిగౌరమ్మ మందిరం ట్రస్ట్‌ కమిటీ సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజు పరివేక్షణలో శరన్నవరాత్రుల పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు కింతలి అమర్‌నాథ్‌, పూజా కమిటీ సభ్యులు ఊన్న భాస్కరరావు, మోనింగి శ్రీహరి, కందుల శ్రీనివాసరావు, గుడ్ల భాస్కరరావు తదితరులు శరన్నవరాత్రుల పూజలను వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే స్ధానిక రాణిగుడ ఫారం నీళ్ల ట్యాంక్‌ కాలనీలో వేద పండితులు రేజేటి శ్రీనివాస్‌ శర్మ ఆధ్వర్యంలో గురువారం సహస్ర లక్ష కుంకుమార్చన పూజలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement