కొరాపుట్ జిల్లా కలెక్టర్ సత్యవాన్ మహాజన్
కొరాపుట్: పరుమాలి గుహలను పర్యాటక రంగంలో అభివృద్ధి చేస్తామని కొరాపుట్ జిల్లా కలెక్టర్ సత్యవాన్ మహాజన్ ప్రకటించారు. జిల్లాలోని నందపూర్ సమితి దారెంగ్బా గ్రామ సమీపంలో ఉన్న గుహలను కలెక్టర్ గురువారం సందర్శించారు. గుహల లోపల చీకటి ప్రాంతాలను తిలకించారు. అక్కడ కొలువు తీరిన గిరిజన దేవతకి పూజలు చేశారు. స్థానిక గిరిజనులు ఈ గుహ ప్రాధాన్యత కలెక్టర్కి వివరించారు. సిమిలిగుడ పట్టణానికి 27 కిలో మీటర్ల దూరంలో ప్రధాన మంత్రి సడక్ మార్గానికి 200 మీటర్ల దూరంలో ఈ గుహలు ఉన్నాయి. గుహల సహజ సౌందర్యాన్ని చూసి కలెక్టర్ ముగ్దులయ్యారు. ఈ ప్రాంతంలో రోడ్డు మార్గం, విద్యుత్, వాచ్ టవర్, విశ్రాంతి కుర్చీలు తదితర సౌకర్యాల ఏర్పాటు కోసం అధికారులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.


