పర్లాకిమిడి: స్థానిక దండుమాలవీధిలో దండుమారెమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరిచే దండుమాలమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. విజయదశమి నాడు నిశిరాత్రిన అమ్మవారికి పూజలు జరిపి తిరిగి తలుపులు మూసేస్తారు. స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి దండుమారెమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. డోలా ట్యాంకు రోడ్డులో ఉన్న దండుమారెమ్మ గుడి వద్ద వివిధ గణపతి విగ్రహాలు మేళతాళాలు వాయించే విధానం ప్రతి ఒక్కరికీ ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 17న అమ్మవారి ప్రసాద వితరణ ఉంటుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు.


