పక్కాగా ఓటర్ల జాబితా తయారీకి చర్యలు | - | Sakshi
Sakshi News home page

పక్కాగా ఓటర్ల జాబితా తయారీకి చర్యలు

Oct 15 2026 8:06 AM | Updated on Oct 15 2026 8:06 AM

రాయగడ: రానున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తప్పులు లేని ఓటర్ల జాబితా తయారీకి అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా రాయగడ సమితిలోని సద్బావన సమావేశ మందిరంలో బూత్‌స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ స్థాయి పర్యవేక్షకులు, సర్వే బృందాలకు రెండు రోజుల పాటు శిక్షణ నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రానున్న పంచాయతీ ఎన్నికల కోసం వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాయగడ జిల్లాలో ఈ ప్రక్రియ అక్టోబరు 26 నుంచి ప్రారంభమవుతుంది. సర్వే బృందాలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించి జాబితాను రూపొందించనున్నాయి. ప్రతీ వార్డులోని ఓటర్లను ఇంటి నంబర్ల ఆధారంగా నమోదు చేయడంతో పాటు, కొత్తగా ఓటుహక్కు పొందిన వారిని, గత జాబితాలో చోటు దక్కని అర్హులను గుర్తించనున్నారు. అదే సమయంలో అర్హత లేని ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అక్టోబర్‌ 7న జిల్లాస్థాయి శిక్షణ ఇచ్చారు. తాజాగా రాయగడ సమితిలో నిర్వహించిన శిక్షణలో బీడీవో సుజీత్‌ కుమార్‌ నాయక్‌, జీపీడీవో స్మృతిరేఖ నాయక్‌, పీఈవో సునీల్‌ బ్రహ్మ, హెచ్‌ఎం నీలాంచల్‌ మిశ్రా వనరుల వ్యక్తులుగా వ్యవహరించి సిబ్బందికి శిక్షణ అందించారు. సమితిలోని 129 అసెంబ్లీ పోలింగ్‌ బూత్‌లకు ఒక్కొక్క సర్వే బృందాన్ని ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement