25 మంది దివ్యాంగులకు పింఛన్ల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

25 మంది దివ్యాంగులకు పింఛన్ల పంపిణీ

Oct 15 2026 8:06 AM | Updated on Oct 15 2026 8:06 AM

రాయగడ: దివ్యాంగులకు సామాజిక భద్రత కల్పించి.. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన ప్రతిఒక్కరికీ అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్‌ అభిమాన్‌లో భాగంగా రాయగడలో దివ్యంగుల సహాయ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఇందులో భాగంగా కొత్తగా అర్హత పొందిన 25 మంది దివ్యాంగులకు పింఛన్లను పంపిణీ చేశారు. స్థానిక అశోక్‌ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా అదనపు మేజిస్ట్రేట్‌ రవీంద్రనాథ్‌ కహార్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమం, సామాజిక భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలొ రాయగడ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శ్రమిత పాడి, జిల్లా సామాజిక భద్రత అధికారి ఎలిజబెత్‌ గరడా, ఉప విభాగ సామాజికి భద్రతాధికారి శ్రీకాంత్‌ కుమార్‌ పాణిగ్రహి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement