రాయగడ: మహిళలు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆకాంక్షించారు. జిల్లాలో రామనగుడ సమితిలోని చాకుండాలో ఉన్న మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మరమరాల తయారీ కేంద్రాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా 15 మంది గిరిజన మహిళలు స్వయం ఉపాధి పొందడంతో పాటు భవిష్యత్లో మరికొందరికి ఉపాధి కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందించడం ప్రశంసించదగ్గ విషయమన్నారు. ఈ కేంద్రం కేవలం అంగన్వాడీ కేంద్రాలకు మరమరాలు సరఫరా చేయడానికే పరిమితం కాకుండా, పూర్తిస్థాయి వ్యాపార సంస్థగా అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు ఆరతీ ముటిక తదితరులు పాల్గొన్నారు.


