వైభవంగా శరన్నవరాత్రి పూజలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా శరన్నవరాత్రి పూజలు

Oct 14 2026 4:11 AM | Updated on Oct 14 2026 4:11 AM

వైభవంగా శరన్నవరాత్రి పూజలు

రాయగడ: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన మంగళవారం అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. బాలాజీనగర్‌లో కల్యాణ వేంకటేశ్వర మందిరం ప్రాంగణంలో ఉన్న రాజ్యలక్ష్మీ అమ్మవారికి సామూహిక నవ ఆవరణ అర్చన కార్యక్రమం కన్నుల పండువగా జరిపించారు. ప్రధానార్చకులు భాస్కరాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్యాంక్‌ కాలనీలో మహిళలు సామూహిక కలశ స్థాపన పూజలు నిర్వహించారు. కస్తూరీ నగర్‌ సత్యనారాయణ మందిరం ప్రాంగణంలోలక్ష్మీ అమ్మవారికి ప్రధాన అ ర్చకులు మావుడూరు కిషోర్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement