రాయగడ: జిల్లాలోని జేకేపూర్లొ ఈ ఏడాది దుర్గాపూజ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహించేందుకు పూజా కమిటీ విస్తృత ఏర్పాట్లు చేస్తొంది. కమిటీ అధ్యక్షుడు వినయ్ ద్వివేది, కార్యదర్శి విశ్వజీత్ ద్వివేది నాయకత్వంలో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. దుర్గాపూజ సందర్భంగా భక్తులు, సందర్శకులకు ఆకట్టుకునేలా వివిధ స్లాళ్ల ఏర్పాటు, పందిళ్లు విద్యుత్ అలంకరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాండియా నృత్య కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
20 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు
ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. 21న బూగీ బూగీ నృత్య ప్రదర్శన, ఒపేరా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే 21, 22, 23, తేదీల్లో మ్యూజిక్ నైట్స్తో పాటు మీనా బజారు నిర్వహించనున్నారు. 21వ తేదీన రావణ దహనం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.


