కొత్త గవర్నర్‌గా బ్రజ్‌మోహన్‌ రామ్‌ | - | Sakshi
Sakshi News home page

కొత్త గవర్నర్‌గా బ్రజ్‌మోహన్‌ రామ్‌

Oct 14 2026 4:11 AM | Updated on Oct 14 2026 4:11 AM

కొత్త గవర్నర్‌గా బ్రజ్‌మోహన్‌ రామ్‌

భువనేశ్వర్‌: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జార్ఖండ్‌లోని పలాము జిల్లాకు చెందిన బ్రజ్‌ మోహన్‌ రామ్‌ను ఒడిశా కొత్త గవర్నర్‌గా నియమించారు. 2025 జనవరి 3న గవర్నరుగా బాధ్యతలు స్వీకరించిన డాక్టరు హరిబాబు కంభంపాటి స్థానంలో బ్రజ్‌ మోహన్‌ రామ్‌ బాధ్యతలు చేపడతారు. రామ్‌ అవిభక్త బీహార్‌లో 1996, 1998, 1999లలో మూడుసార్లు పలాము లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1991–1995 మధ్య బీహార్‌ అసెంబ్లీ సభ్యుడిగా కూడా పనిచేశారు. జార్ఖండ్‌లో ధోబీ వర్గానికి చెందిన బీజేపీ దళిత నాయకుడైన రామ్‌ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. ఆయనకు శాసన, సామాజిక సేవలో సుదీర్ఘ అనుభవం ఉంది. అవిభక్త బీహార్‌లో ఎమ్మెల్యేగా పని చేసిన తర్వాత 1996, 1998, 1999లో పలాము నియోజక వర్గం నుండి 3 సార్లు లోక్‌ సభకు ఎన్నికయ్యారు. ఆయన రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల మోర్చాకు ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. ధోబీ మహాసంఘ్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. చంద్వాలో విద్యాసంస్థల స్థాపన కోసం విశేష కృషి చేశారు. క్షేత్రస్థాయి నాయకత్వానికి, దళిత వర్గాల సాధికారతకు, దశాబ్దాల శాసన, సామాజిక సేవకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నియామకం జరిగింది. 2025 జనవరిలో ఒడిశా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన హరిబాబు కంభంపాటి ఆ పదవిలో సుమారు ఏడాది తొమ్మిది నెలలు పనిచేసి విశేష ప్రజాదరణ పొందారు. ఒడిశా కొత్త గవర్నర్‌గా నియమితులైన బ్రజ్‌ మోహన్‌ రామ్‌కు ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement