పీఎం పోషణ పథకంపై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

పీఎం పోషణ పథకంపై శిక్షణ

Oct 14 2026 4:11 AM | Updated on Oct 14 2026 4:11 AM

పీఎం పోషణ పథకంపై శిక్షణ

పర్లాకిమిడి: ప్రధానమంత్రి పోషణ (పీఎం పోషణ) పథకంలో జాతీయ రూరల్‌ లివ్‌లీహుడ్‌ మిషన్‌ ఆధ్వర్యంలో ఆహారం, పౌష్టికాహారం, ఆరోగ్యం, వర్క్‌పై రెండు రోజుల శిక్షణ శిబిరం మంగళవారం ప్రారంభమైంది. ఒడిశా జీవనోపాదుల మిషన్‌, డీపీఎం టిమోన్‌ బోరా అతిథిగా విచ్చేసి పంచాయతీ రిసోర్సు భవనంలో మంగళవారం ప్రారంభించారు. జిల్లాలోని ఆర్‌.ఉదయగిరి, నువాగడ, రాయగడ, మోహానా నుంచివిచ్చేసిన కమ్యూనిటీ రిసోర్సు పర్సన్లు, ఎంబీఐసీ, పోషణ సఖి కార్యకర్తల ట్రైనర్లకు మాస్టర్‌ ట్రైనింగ్‌ను రెండు రోజుల పాటు జిల్లా పరిషత్‌ ఆవరణలో ఉన్న పంచాయితీ రిసోర్సు భవనంలో శిక్షణను అందజేస్తామని బ్లాక్‌ ప్రోగ్రాం మేనేజర్‌ సి.హెచ్‌.తిరుపతి తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement