పెన్షనర్ల సమస్యలు పరిష్కారమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

పెన్షనర్ల సమస్యలు పరిష్కారమే ధ్యేయం

Oct 14 2026 4:11 AM | Updated on Oct 14 2026 4:11 AM

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

శ్రీకాకుళం అర్బన్‌/శ్రీకాకుళం కల్చరల్‌: పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా ఏపీ స్టేట్‌ గవర్నమెంట్‌ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ కృషి చేస్తోందని సంఘ గౌరవాధ్యక్షుడు బలివాడ మల్లేశ్వరరావు అన్నారు. ఏపీ స్టేట్‌ గవర్నమెంట్‌ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శ్రీకాకుళం ఎన్జీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1984లో సంఘం ఏర్పాటైందని, నేడు 43వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు కె.సోమసుందరరావు, రాష్ట్ర సంఘ కార్యదర్శి పి.నరసింహమూర్తి, సిటీ బ్రాంచ్‌ అధ్యక్షులు బి.జానకి, ఏపీ స్టేట్‌ గవర్నమెంట్‌ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

పోలీసులు నిర్లక్ష్య వైఖరి వీడాలి

టెక్కలి: నందిగాం మండలం జడ్యాడ గ్రామంలో దళితులపై దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం టెక్కలి అంబేడ్కర్‌ భవన్‌ వద్ద రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎన్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మిస్క కృష్ణయ్య మాట్లాడుతూ జడ్యాడ గ్రామంలో దళితులపై దాడి చేసిన వారిపై చర్యల విషయంలో పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు చల్లా రామారావు, బి.ప్రభాకర్‌, కోత ధర్మారావు, కె.దమయంతి, కె.కామేశ్వరరావు, ఎస్‌.దామోదర్‌, కె.దాలయ్య, జె.బాబూరావు, వై.గోపి, ఎ.మాధవరావు, బి.గోవింద్‌, ఆర్‌.ఈశ్వరరావు, సురేష్‌, ఆర్‌.ఆదిలక్ష్మి, జయలక్ష్మి, వి.రామయ్య, సవరయ్య, ఆర్‌.రామ్ముర్తి, సుబద్రమ్మ, టి.మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

గార : నిత్యం మద్యం తాగి వస్తుండటంతో కుటుంబ భవిష్యత్‌ ఏమవుతుందని భార్య నిలదీయడంతో ఓ వ్యక్తి మనస్థాపంతో కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతివాడ పంచాయతీ యాళ్లపేట గ్రామానికి చెందిన యాళ్ల షణ్ముఖరావు (42) మూడేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 6న గ్రామంలో వారాలు జరుగుతుండగా మద్యం మత్తులో ఇంటికి రావడంతో భార్య మందలించింది. ఆ తర్వాత కాసేపటికే వాంతులు చేసుకోవడంతో గమనించగా, పారాపెట్‌ అనే కలుపు మందును తాగినట్లు గుర్తించారు. వెంటనే రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించాడు. షణ్ముఖరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భార్య సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెచ్‌సీ రవిబాబు తెలిపారు.

వలస పక్షుల

సంరక్షణకు కృషి

ఇచ్ఛాపురం రూరల్‌: తేలుకుంచి గ్రామానికి ప్రతి ఏటా వస్తున్న విదేశీ పక్షుల సంరక్షణకు కృషి చేస్తానని ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఎం.మురళీకృష్ణ అన్నారు. ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా మంగళవారం తేలుకుంచి విదేశీ పక్షుల విడిది కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్షులు గుడ్లు పొదిగే సమయంలో ప్రత్యేకంగా తయారు చేసిన గూళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పక్షి పిల్లలను సంరక్షించేందుకు, మృత్యుబారిన పడకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తేలుకుంచి గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఆయన వెంట ఫారెస్ట్‌ అధికారులు టి.దేవరాజు, భానుమూర్తి, సురేష్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement