సందడిగా పోషణ మాసోత్సవం | - | Sakshi
Sakshi News home page

సందడిగా పోషణ మాసోత్సవం

Oct 14 2026 4:11 AM | Updated on Oct 14 2026 4:11 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లాస్థాయి పోషణ మావోత్సత్సవాన్ని ఉత్సహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి పోషకాహారంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ సోమనాద్‌ ప్రధన్‌, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి సుచితా పండా, జిల్లా అదనపు సాంఘిక సంక్షేమా అధికారి మమతా చౌదరి, అన్ని శిశు అభివృద్ధి ప్రాజెక్టుల అధికారులు, జిల్లా పోషణ సమన్వయకర్త పాల్గుని పోషకారహారం ప్రాధాన్యతను వివరించారు. అదనపు కలెక్టర్‌ సోమనాధ్‌ ప్రధాన్‌ మాట్లాడుతూ.. స్థానికంగా లభించే పోషక విలువలు కలిగిన ఆహర పదార్ధాలను సరైన విధంగా వినియోగించడం ద్వారా పోషకాహర లోపాన్ని నివరించవచ్చును తెలిపారు. వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించి సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement