టికిరిలో బీజేడీ జనసంపర్క యాత్ర | - | Sakshi
Sakshi News home page

టికిరిలో బీజేడీ జనసంపర్క యాత్ర

Oct 14 2026 4:11 AM | Updated on Oct 14 2026 4:11 AM

రాయగడ: బీజేడీ జిల్లా అధ్యక్షుడు జగన్నాధ సరక నేతృత్వంలో మంగళవారం జిల్లాలోని కాసీపూర్‌ సమితి టికిరిలో జనసంపర్క పాదయాత్ర జరిగింది. టికిరి ప్రధాన మార్కెట్‌ నుంచి ప్రారంభమైన యాత్ర వివిధ కూడళ్ల మీదుగా పంచాయతీ సమితి కార్యాలయం వరకు కొనసాగింది. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి, బీజేడీ సీనియర్‌ నాయకుడు సంజయ్‌ దాస్‌ వర్మ, ఎస్‌డీసీ మాజీ అధ్యక్షురాలు అనసూయా మాఝి, జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు సరస్వతీ మాఝి, మాజీ ఎంఎల్‌ఏ మకరంద ముదులి తదితరులు పాల్గొన్నారు. అధికార బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఈ సందర్భంగా ఎండగడుతూ బీజేడీ పార్టీ నాయకులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్‌యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement