మల్కన్‌గిరి: న్యాయ సేవలు, సామాజిక న్యాయం, ప్రజాసేవ రంగాల్లో విశేష కృషి చేసినందుకు మల్కన్‌గిరికి చెందిన సీనియర్ న్యాయవాది నృహింహ చరణ్ మహంతికి ఒడిశా గౌరవ్ సమ్మాన్–2026 పురస్కారం వరించింది. హ్యుమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఇండియా ఆధ్వర్యంలో భువనేశ్వర్‌లోని మేఫెయిర్ కన్వెన్షన్‌లో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఎక్స్‌లెన్స్ ఇన్ లీగల్ సర్వీస్ అండ్ సోషల్ జస్జిస్ విభాగంలో ఈ గౌరవాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ ఒడి శా డీఐజీ బలరామ్ బెహరా, నటి, సామాజిక కార్య కర్త వర్షా ప్రియదర్శిని, ఉన్నతాధికారులు, న్యాయ మూర్తులు హాజరయ్యారు. మహంతి చాలా కాలంగా పేదలు, నిరుపేదలు, న్యాయ సహాయం పొందలేని బాధితులకు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నారు. ఆయన రెండు సార్లు మల్కన్‌గిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించా రు. ప్రస్తుతం ఆ సంఘానికి కార్యదర్శిగా సేవలుందిస్తున్నారు.


