వైశ్యుల ఐక్యతే సమాజాభివృద్ధికి బలం | - | Sakshi
Sakshi News home page

వైశ్యుల ఐక్యతే సమాజాభివృద్ధికి బలం

Oct 13 2026 1:05 AM | Updated on Oct 13 2026 1:05 AM

వైశ్యుల ఐక్యతే సమాజాభివృద్ధికి బలం

రాయగడ: వైశ్యులంతా ఐక్యంగా ముందుకు సాగినప్పుడే సమాజ అభివృద్ధి సాద్యమని, ఐక్యతతోనే సామాజిక సమస్యలకు పరిష్కారమర్గాలు కనుగొనవచ్చని జిల్లా వెశ్య సంఘం అధ్యక్షుడు కింతలి ఆమర్‌నాఽథ్‌ అభిప్రాయపడ్డారు. సోమవారం జేకేపూర్‌లో నిర్వహించిన జిల్లా వైశ్య మహాసంఘం ఎగ్జిక్యూటీవ్‌ సభ్యుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. సంఘం ద్వారా చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలు వివరించారు. అదేవిధంగా భవిష్యత్‌లో సంఘం తరఫున చేపట్టనున్న సేవా కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. వైశ్యులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి సమాజ అభ్యున్నతికి అవసరమైన అంశాలపై చర్చించడం ఈ మహాసభ ప్రధాన ఉద్దేశమని అన్నారు. వివిధ ప్రాంతాల్లోని వైశ్య సంఘాల మధ్య సమన్యయం పెంపొందించడం, పరస్పర సహకారంతో ముందుకు సాగడంతోనే చేపట్టే జనహిత కార్యక్రమాలు విజయవంతం అవుతాయని అభిప్రాపడ్డారు. భవిష్యత్‌లో ఇటువంటి తరహా కార్యక్రమాలు నిర్వహించడంతో సంఘం ఐక్యత బలపడటంతో పాటు వివిధ సమస్యలు అందరి దృష్టికి వచ్చి వాటి పరిష్కార మార్గాలను అన్వేషించే అవకాశం కలుగుతోందన్నారు. సమావేశంలో సంఘం ప్రముఖులు పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement