పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ కోరడాసింగి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం సి.సి.డి స్వచ్ఛంద సంస్థ , దేశాయ్ ఫౌండేషన్ ట్రస్టు సహాకారంతో ‘బాల హెల్త్ మేళా’ను నిర్వహించారు. బాలబాలికల ఆరోగ్యం, పౌష్టిక ఆహారం తీసుకోవడం, వ్యక్తిగత పరిపక్వత సంబంధించి సహకరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని సెంటర్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సంస్థ కార్యదర్శి అడ్డాల జగన్నాథ రాజు అన్నారు. రాయఘడ బ్లాక్ నుంచి వచ్చిన వివిధ పాఠశాల విద్యార్థినులకు బరువు, ఎదుగుదల, రక్తహీనత, కళ్ల పరీక్షలు, పౌష్టిక ఆహారం, రుతుస్రావానికి సంబంధించి స్వచ్ఛత పాటించడంపై అధికారులు అవగాహన కల్పించారు. అనంతరం వక్తృత్వం, డ్యాన్స్, సంగీతం, పెయింటింగ్, ఆటల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొరడాసింగి సర్పంచ్ ఉమాశంకర్ భూమల్, పంచాయతీ విద్యాశాఖాధికారి పి.కిరణ్కుమార్, సి.ఆర్.సి.సి అశ్వినీ కుమార్ పాడీ, ప్రధాన ఉపాధ్యాయులు కేదార్ చంద్ర రౌతో, విశ్రాంత ఉపాధ్యాయులు సౌతీ జన్నీ తదితరులు పాల్గొని మాట్లాడారు.


