అలుగు పుర్రెల అక్రమ విక్రయం | - | Sakshi
Sakshi News home page

అలుగు పుర్రెల అక్రమ విక్రయం

Oct 12 2026 8:34 AM | Updated on Oct 12 2026 8:34 AM

ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థులను గెలిపించండి

రాయగడ: అలుగు (పాంగొలిన్‌) పుర్రేలను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. శనివారం ఉదయం సుమారు 11.30 గంటల ప్రాంతంలో పట్టణంలోని ఒఆర్‌ఎంఏఎస్‌ కార్యాలయం వెనుక ఉన్న మైదానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుల నుంచి నాలగు కిలోగ్రాములకు పైగా బరువు ఉన్న అలుగు పుర్రెను స్వాధీనం చేసుకున్నట్లు అటవీ శాఖ వర్గాలు తెలిపాయి. జిల్లా అటవీ శాఖ అధికారి ఆదేశాల మేరకు రాయగడ అటవీ రేంజ్‌ అధికారి అనిల్‌ కుమార్‌ పాణిగ్రహి ఈ దాడి నిర్వహించారు. ఈ ఘటనలో జిల్లాలోని పనసపుట్‌ గ్రామానికి చెందిన జగన్‌ హిమిరిక, కుంభికొట గ్రామానికి చెందిన నీలాంబర్‌ ఖొస్ల, పురుషొత్తం ఖొస్లలను అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ వ్యాపారంలో మరెవరైనా పాల్గొన్నారా అనే కోణంలో అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ సతీస్‌ కుమార్‌ ధారువా దర్యాప్తు చేస్తున్నారు.

బ్యాడ్మింటన్‌ పోటీల్లో

క్రీడాకారుని ప్రతిభ

రాయగడ: భువనేశ్వర్‌లోని పొఖరిపుట్‌లో ఈ నెల తొమ్మిది నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన ఆల్‌ ఒడిశా 40వ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో రాయగడకు చెందిన పంతాల చక్రవర్తి, గంజాంకు చెందిన ఎ.సాయి లక్ష్మీరావు జోడీ రన్నరప్‌గా నిలిచింది. వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనగా మిక్స్‌డ్‌ డబల్స్‌ విభాగంలో చక్రవర్తి–సాయి లక్ష్మీరావు జోడి ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానాన్ని సాధించింది. క్రీడాభిమానులు, అధికారులు వీరిని అభినందించారు.

వంశధారలో మునిగి బాలుడు మృతి

రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌ ప్రాంతంలో గల వంశధార నదిలో స్నానానికని వెళ్లిన ఏడో తరగతి విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుడిని సమితిలోని చాలకంబ పంచాయతీ పరిధిలోని పొడాసింగ్‌ గ్రామానికి చెందిన ఖిరొసింధు సబర్‌ (12) గా గుర్తించారు. గుణుపూర్‌లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న సబర్‌ అనారోగ్యంతో పాఠశాల నుంచి సెలవుపై ఇంటికి శుక్రవారం నాడు వచ్చాడు. ఆదివారం ఉదయం అతడి తండ్రి బనసబర్‌ సైకిల్‌ పై పొలానికి వెళ్లాడు. వంశధార నది సమీపంలో నది ఉండటంతో, తన స్నేహితులతో కలసి బాలుడు నది వద్దకు వెళ్లాడు. అక్కడ స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సమాచారం తెలుసుకున్న గుణుపూర్‌ పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పొస్టుమార్టం కొసం గుణుపూర్‌ సబ్‌ డివిజన్‌ ఆస్పత్రికి తరలించారు.

కొరాపుట్‌: జయపూర్‌లో విక్రం దేవ్‌ యునివర్సిటీ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ జెండాపై పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని జ యపూర్‌ ఎమ్మెల్యే తారా ప్రసాద్‌ బాహీణిపతి విజ్ఞప్తి చేశారు. ఆదివారం జయపూర్‌ పట్టణంలో ఓ హోటల్‌ జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం యునివర్సిటీ మరమ్మత్తుల కోసం రూ.20 కోట్లు నిధులు మంజురయ్యాయన్నారు. గత ప్రభుత్వం హయంలో ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం జరిగిందన్నారు. వర్సిటీ గా హోదా పొందిందన్నారు. ఈ విడత కూడా కొత్త బస్టాండ్‌, మెడికల్‌ ఎదురుగా రెండు హా స్టళ్లు నిర్మిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో స్థానిక యువతకి ప్రభుత్వ గ్రూప్‌ సీ, డీ స్థాయి ఉద్యోగాల కోసం పోరాటం చేస్తామన్నారు. ప్రస్తుతం పోటీ చేస్తున్న విద్యార్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నా రు. తమ అభ్యర్థులు గెలిచిన తర్వాత మంచి ఫ్యాకల్టీ కోసం కృషి చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement