● తరలివచ్చిన భక్తులు
పర్లాకిమిడి: స్థానిక ఒకటో వార్డు పెట్రోలు బంకు వెనుక ఉన్న వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయ జీర్ణోద్ధరణ, పూర్ణక అష్టోత్తర కలశ అభిషేకం, సంప్రోక్షణ మహోత్సవాలు ఆదివారం ఉదయం ఘనంగా జరిగాయి. ఆలయం పునర్నిర్మానానికి ప్రముఖ వ్యాపారవేత్త వైశ్యరాజు కాశీరాజు, ఆలయ కమిటీ అధ్యక్షులు వైశ్యరాజు బాలాజీ రాజు నిధులు వెచ్చించిన అనంతరం సంప్రోక్షణ, కలశ అభిషేకాలు, 108 మంది దంపతులచే పూజలు చేయించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి వనమాలి మాణిక్యశర్మ పూజలు చేయించగా, వైశ్యరాజు బాలాజీ, రాఽధిక దంపతులు, చాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, ఆలయ కమిటీ కార్యదర్శి పొట్నూరు రామక్రిష్ణ దంపతుల ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమాలు పూర్తిచేశారు. మధ్యాహ్నం భక్తులందరికీ అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. అలాగే కన్యకాపరమేశ్వరీ ఆలయంలో శరన్నవరాత్రి సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి కుంకుమ పూజలు ప్రారంభించారు.


