కళాశాలలో ఎన్నికల సందడి | - | Sakshi
Sakshi News home page

కళాశాలలో ఎన్నికల సందడి

Oct 12 2026 8:34 AM | Updated on Oct 12 2026 8:34 AM

● బరిలో 32 మంది అభ్యర్థులు

● అధ్యక్ష పదవికి చతుర్ముఖ పోటీ

రాయగడ: స్థానిక అటానమస్‌ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థి సంఘం ఎన్నిల సందడి నెలకొంది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో తుది అభ్యర్థుల జాబితా విడుదలైంది. మొత్తం 32 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడుతుండటంతో ప్రధాన పోరు ఆసక్తికరంగా మారింది.

అధ్యక్ష బరిలో..

విద్యార్థి సంఘ అధ్యక్ష పదవికి జగదీష్‌ నాయక్‌, సుమిత్‌ రత్నాలు, తుషార్‌ కాంత్‌ తురుక్‌, బుద్ధదేవ్‌ హుయిక పోటీ పడుతున్నారు. ఉపాధ్యక్ష పదవికి విశ్వజీత్‌ నాయక్‌, బబులా నాయక్‌, శుభలక్ష్మీ నాయక్‌లు బరిలో ఉన్నారు.

ప్రధాన పదవులకు పోటీ ఇలా..

సాధారణ కార్యదర్శి పదవికి కిలక భాను, చందన్‌ కరకరియా, ముఖేష్‌ సునా, రుద్రనారాయణ గౌడొలు పోటీ చేస్తున్నారు. సహ కార్యదర్శి పదవికి రాహుల్‌ కరకరియా, శివమ్‌ కుమార్‌ డాకువా, హితేస్‌ కుమార్‌ ఛత్రియాలు పోటీలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement