రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

Oct 12 2026 8:34 AM | Updated on Oct 12 2026 8:34 AM

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ ● ఎనిమిది పతకాలను కొల్లగొట్టిన మల్కన్‌గిరి జిల్లా క్రీడాకారులు

● ఎనిమిది పతకాలను కొల్లగొట్టిన మల్కన్‌గిరి జిల్లా క్రీడాకారులు

మల్కన్‌గిరి: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో మల్కన్‌గిరి జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. కేంద్రుఝర్‌లో ఈ నెల ఏడో తేదీ నుంచి నిర్వహించిన పాఠశాల అఽథ్లెటిక్స్‌ పోటీల్లో ఎనిమిది పతకాలతో మెరిశారు. 14 సంవత్సరాల్లోపు బాలురు విభాగంలో ముదిలిపోఢ ప్రభుత్వ ఎస్‌ఎస్‌డీ పాఠశాలకు చెందిన విద్యార్థి పీతావాస్‌ శిషా 400 మీటర్ల పరుగు పోటీల్లో స్వర్ణ పతకం, 100, 200 మీటర్ల పరుగు పోటీల్లో కాంస్య పతకాలు సాంధించాడు. అలాగే 4/100 మీటర్ల రిలే పరుగులో జగన్నాథ్‌ నాయక్‌, ఆకాశ్‌ బందం, సలీమ్‌ పాడ్కమి, అభి మాడ్కామిలతో కూడిన జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కై వసం చేసుకుంది. ఈ పోటీల్లో మల్కన్‌గిరి జిల్లా క్రీడాకారులు రెండు పసిడి, ఒక రజతం, ఐదు కాంస్య పతకాతో మొత్తం ఎనిమిది పతకాలు సాధించి జిల్లాకు గౌరవం తెచ్చారు. జిల్లాకు ఆదివారం చేరుకున్న క్రీడాకారులకు జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజాన్‌ పాణిగ్రాహి, జిల్లా క్రీడా అధికారి మున్న తురక్‌, జిల్లా శారీరక విద్యాధికారి కార్తీక్‌ చంద్రబెహర, టీమ్‌ మేనేజర్లు, కోచ్‌లు, వ్యాయామ ఉపాధ్యాయులకు స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement