కొరాపుట్: జయపూర్లో అంతర్జాతీయ బాలికల, చిన్నారుల దినోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. జయపూర్ సిటీ గర్ల్స్ హైస్కూల్ నుంచి బాలికలు సైకిల్ ర్యాలీ చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న సీవా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అజయ్ కుమార్ మిశ్రా ర్యాలీని ప్రారభించారు. ఈ ర్యాలీ నెహ్రు నగర్, ఎంజీ రోడ్డు, మెయిన్ రోడ్డు, ఎన్కేటీ రోడ్డు, పీఆర్ పేట, కుంబారు వీధుల మీదుగా హరిశ్చంద్ర గుడ వరకు జరిగింది. అక్కడ బాలికలకు స్వయం రక్షణ కోసం ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీవా కార్యదర్శి ప్రతాప్ పట్నాయక్, సభ్యులు కె.మెహన్రావు, ఎస్.రాజ్శేఖర్, ప్రదిప్త కుమార్ సాహు, ధనపతి పరజ, కావ్యాంజలి పాల్గొన్నారు.


