పర్లాకిమిడి: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని పర్లాకిమిడి ఆదర్శ పోలీసు స్టేషన్ సిబ్బంది అన్నారు. పోలీసుఽ అధికారులు, బాలికల మధ్య స్నేహాపూరిత అనుబంధం, బాల్యవివాహాల నిర్మూలన, పోలీసుల పట్ల బాలబాలికలకు విశ్వాసం తెలియజేయడం కోసం పర్లాకిమిడి ఆదర్శ పోలీసు స్టేషన్ సిబ్బంది ‘జువెంటికా కార్యక్రమాన్ని పోలీసు స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం ఉదయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం యూనిసెఫ్ సౌజన్యంతో జరిగింది. తొలుత స్థానిక మహారాజా ప్యాలెస్ జువెంటికా ర్యాలీని వివిధ పాఠశాలల విద్యార్థులు, పోలీసు అధికారులు, డి.సి.పి.ఓ అరుణ్ కుమార్ త్రిపాఠి ఆధ్వర్యంలో జరిగింది. ఈ ర్యాలీలో అన్వేష ప్రభుత్వ హోస్టల్ విద్యార్థులు 200 మంది పాల్గొన్నారు. అనంతరం పోలీసు స్టేషన్లో జరిగిన జువెంటికా కార్యక్రమంలో ఐఐసీ ప్రశాంత భూపతి, డీఎస్పీ నిరంజన్ బెహారా మాట్లాడారు. మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు స్టేషన్కు వచ్చి భయపడకుండా నిందితులపై ఫిర్యాదు చేయాలన్నారు. ఈ సదస్సులో జిల్లా శిశు సురక్షా అధికారి అరుణ్కుమార్, సఖీ వన్ స్టాప్సెంటర్ ఎడ్మిన్ష్ట్రేటర్ సునీతారోథో, అన్వేషా హోస్టల్ అధ్యక్షురాలు మినాతీ పండా, మహిళా, శిశు డెస్క్అధికారి, ఎస్ఐ స్వప్నా బెహరా తదితరులు పాల్గొని మాట్లాడారు.


