వైభవంగా శరన్నవరాత్రులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా శరన్నవరాత్రులు ప్రారంభం

Oct 12 2026 8:34 AM | Updated on Oct 12 2026 8:34 AM

కొరాపుట్‌: దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఆదివారం కొరాపుట్‌, నబరంగ్‌పూర్‌ జిల్లాల్లో వేలాది అమ్మవారి దేవాలయాలలో పూజలు ప్రారంభించారు. జయపూర్‌ మహారాణి పేట లో గల శ్రీ వాసవీ కన్యకా ప్రమేశ్వరి దేవాలయంలో అఖండ దీపం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. రాజరిక దసరా నేపథ్యం ఉన్న జయపూర్‌ రాజా నగర్‌ లో 65 అడుగుల ఎత్తు గల పెండల్‌ ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. జయపూర్‌ రాజ వంశ సంప్రదాయం ప్రకారం పూర్వపు రాజ ధాని నందపూర్‌ లో చారిత్రాత్మక 32 మెట్ల సింహాసనం వద్ద జయపూర్‌ దేవదాయ శాఖ తరఫున అపరాజిత పూజ కోసం ప్రత్యేక ఆహ్వానం ఇచ్చారు. కుంద్రాలో అమ్మవారి దేవాలయాలను జయపూర్‌ రాజరిక దసరా తరఫున దేవేంద్ర బాహిణీపతి ఆహ్వానం అందించారు. నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలో మా బండారు ఘరణి శక్తి పీఠం నుండి రాజ ఖడ్గంతో భారీ ఊరేగింపు జరిగింది. యువత ఆయుధ అఖడాలలో ఆయుధాలు పూజలు చేశారు. శక్తి పీఠం తరఫున వేద పండితులు రాజ వంశీయులకు ఆహ్వానం అందించారు. మెయిన్‌ రోడ్డులో భారీ రంగురంగుల విద్యుద్దీకరణ ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement