మల్కన్‌గిరి జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ | - | Sakshi
Sakshi News home page

మల్కన్‌గిరి జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ

Oct 12 2026 8:34 AM | Updated on Oct 12 2026 8:34 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ–2026లో భాగంగా ఓటర్ల జాబితాను మరింత కచ్చితంగా, పారదర్శకంగా రూపొందించేందుకు విస్తృత కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. జాబితా నుంచి తొలగించిన అర్హులైన ఓటర్లు ఫారం–6 ద్వారా తమ పేర్లును జాబితాలో చేర్చుకునే అవకాశం కల్పించారు. జిల్లా యంత్రాంగం వెల్లడించిన వివరాల ప్రకారం గణన సమయంలో 47,355 మంది, ముసాయిదా ఓటర్లు జాబితా ప్రచురణ అనంతరం మరో 1,189 మంది పేర్లను తొలగించారు. వీరిలో ఇప్పటికే 9,854 మంది ఓటర్ల వివరాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో పొరపాటున తొలగించిన 66మంది ఓటర్లును గుర్తించి వీరిలో 43 మందిని తిరిగి చేర్చేందుకు దరఖాస్తులు స్వీకరించారు. కొత్త, యువ ఓటర్ల నుంచి 367 దరఖాస్తులు అందగా, జిల్లా వ్యాప్తంగా మొత్తం 410 దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మొత్తం 104 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు.

మల్కన్‌గిరి నియోజకవర్గంలో కలిమెల, పోడియా చిత్రకొండ సమితిలో మల్కన్‌గిరి పురపాలక ప్రాంతంలో మొత్తం 28,542 మంది ఓటర్లు పేర్లు తొలగించారు. వీరిలో ఇప్పటివరకు 4,909 మంది ఓటర్ల వివరాలు పరిశీలించగా 36మంది పేర్లు పొరపాటున తొలగించినట్లు గుర్తించారు. ఈ ప్రాంతంలో మొత్తం 228 దరఖాస్తులు స్వీకరించగా సేవలందించేందుకు 47 ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. చిత్రకొండ నియోజకవర్గ పరిధిలో మత్తిలి, చిత్రకొండ, ఖోయిర్‌పూట్‌, కోరుకొండ, బలిమెల ప్రాంతాల్లో 57 శిబిరాలు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement