బహుమతుల ప్రదానం | - | Sakshi
Sakshi News home page

బహుమతుల ప్రదానం

Oct 11 2026 1:22 PM | Updated on Oct 11 2026 1:22 PM

మల్కన్‌గిరి: సమగ్ర శిక్ష మల్కన్‌గిరి కార్యాలయం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా ఉపన్యాసం, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్‌ మాడ్కమి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. సేవ సంకల్ప్‌ అభియాన్‌ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సమితిలో నిర్వహించి అక్కడ ప్రతిభను చాటిన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. వారికి శనివారం జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజాన్‌ పాణిగ్రాహి, ఎంపీ ప్రతినిధి సంజయ్‌ సర్కార్‌, ఎమ్మెల్యే ప్రతినిధి నిహార్‌ రంజాన్‌ రౌయి, సమితి విద్యాశాఖ అధికారి గౌరంగా సాజన్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement